పవన్ కళ్యాణ్ పై అన్నయ్య చిరు కీలక కామెంట్స్ వైరల్..!

Published on Jan 4, 2022 9:00 am IST

గత కొన్ని రోజులు నుంచి మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. మొన్న ఒక సంచలన ప్రకటన ఇవ్వడం దాని తర్వాత మరిన్ని కీలక ఘటనలు ఇండస్ట్రీలో చోటు చేసుకోవడం అన్నీ చకచకా జరిగాయి. అయితే రీసెంట్ గా చిరు మెగా అభిమానులతో ఆ మధ్య తాను మొదలు పెట్టిన ప్రాణవాయు పంపిణీ కార్యక్రమంని నిర్వహించారు.

మరి ఇందులోనే కొన్ని కీలక అంశాలపై కూడా మాట్లాడ్డం జరిగింది. గత కొన్నాళ్లుగా టాలీవుడ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయినటువంటి టికెట్ రేట్స్ ఇష్యూ పై ఆ సమస్యని ఆ మధ్య రిపబ్లిక్ ఈవెంట్ లో తన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశంపై కీలక కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.

పవన్ స్పందన ఎప్పుడూ కూడా సబబు గానే ఉంటుంది అని ఆరోజు పవన్ టికెట్ రేట్స్ విషయంలో యుద్ధం చేసాడు కానీ అప్పుడు ఎవరూ ముందుకు రాలేదు ఇప్పుడు దాని ఫలితం చూస్తున్నారని అలాగే కళ్యాణ్ ఎప్పుడూ న్యాయంగానే మాట్లాడుతాడని చిరు తెలిపారు. దీనితో ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు మెగా ఫ్యాన్స్ లో వైరల్ అవ్వ సాగాయి.

సంబంధిత సమాచారం :