చిరు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఇదే పెద్ద ప్రూఫ్
Published on Oct 25, 2016 1:49 pm IST

khaidi150
ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైధీ నెం 150’ కూడా ఒకరి. 8 ఏళ్ల తరువాత చిరు మళ్ళీ వెండితెరపై హీరోగా కనిపిస్తుండటంతో ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, ఆశలు ఉన్నాయి. దీంతో సినిమాకు సంబందించిన అన్ని రకాల బిజినెస్ విషయాల్లోనూ భారీ స్థాయి పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం యొక్క ఆంధ్రా డిస్ట్రిబ్యూషన్ హక్కులు రూ. 32 కోట్ల భారీ ధరకు అమ్ముడవగా తాజా ఈ సినిమా ఆ యొక్క శాటిలైట్ రైట్స్ కూడా అదే స్థాయి ధరను పలికాయి.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మా టీవీ సంస్థ చిరంజీవి ఛరీష్మాన్ని, ఫ్యాన్ బేస్ ని దృష్టిలో పెట్టుకుని ఈ హక్కులను రూ. 14 కోట్ల భారీ మొత్తానికి కొనుక్కుంది. వరుసగా హిట్లు కొట్టి ఫామ్ లో ఉన్న యంగ్ స్టార్ హీరోలకే సాధ్యం కానీ ఈ ఫీట్ ను చిరు 8 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తూ అవలీలగా సాధించడాన్ని బట్టి చూస్తే అభిమానవుల్లో చిరంజీవి ఛరీష్మా, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఇట్టే అర్థమవుతోంది. ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రసుతం పాటల షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే 2017 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook