మెంటల్ మాస్ లుక్ లో మెగాస్టార్..పూర్వ వైభవం తెచ్చిన బాబీ!

Published on Nov 6, 2021 12:36 pm IST

మెగాస్టార్ చిరంజీవికి మాస్ లో ఏ లెవెల్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. అలాగే తన లెవెల్ మాస్ సినిమా చూసి కూడా చాలా కాలమే అయ్యింది. కానీ ఫైనల్ గా ఈ మాస్ ట్రీట్ ని తన సినిమాతో చూపిస్తానని దర్శకుడు బాబీ ఎప్పుడు నుంచో తెలుపుతున్నాడు. మెగాస్టార్ 154వ సినిమాగా పక్కా మాస్ ఎంటర్టైనర్ ని అందిస్తానని ప్రామిస్ చేసాడు. మరి ఈరోజు ఈ సాలిడ్ సినిమాపై అదిరే అప్డేట్ ని కూడా ఇచ్చాడు.

మళ్ళీ చిరు ని నెవర్ బిఫోర్ గా మెంటల్ మాస్ లుక్ తో సిద్ధం చేసి అన్నయ్య అరాచకం ఆరంభం అంటూ ప్రెజెంట్ చేసాడు. ఒకప్పుడు బిగ్ బాస్ తరహాలో మెగాస్టార్ తో గ్లాసెస్, స్టైల్ గా సిగరెట్ వెలిగించడం మేడలో ఆ గొలుసు ఇవన్నీ చూస్తుంటే మెగా ఫ్యాన్స్ కి పూర్వ వైభవం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ బడా ప్రాజెక్ట్ పై ఎప్పుడు నుంచో భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని బీట్ చేసేలా చిత్ర యూనిట్ ఈ లుక్ ని వదిలారు. ఇక ఈ భారీ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :