“గాడ్ ఫాథర్” లో సల్మాన్ రెమ్యునరేషన్ ఎంతంటే.!

Published on Oct 1, 2022 10:00 pm IST


మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సాలిడ్ గెస్ట్ రోల్ లో నటించిన లేటెస్ట్ చిత్రం “గాడ్ ఫాథర్” దర్శకుడు జయం మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలు సెట్ చేసుకొని సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రంలో స్పెషల్ రోల్ కి గాను సల్మాన్ ఖాన్ నటించడంతో మరింత గ్రాండ్ స్కేల్ లోకి వెళ్లిన ఈ చిత్రం హిందీలో కూడా మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

అయితే సల్మాన్ ఈ చిత్రంలో చేసిన రోల్ కి గాను ఎంత ఛార్జ్ చేశారు అనే దానిపై మెగాస్టార్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. ఈ చిత్రానికి అయితే సల్మాన్ అసలు రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలిపారు. దీనితో చిరు మరియు సల్మాన్ ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎంత గట్టిదో అర్ధం అవుతుంది. ఇక ఈ ఇద్దరు మెగాస్టార్స్ సిల్వర్ స్క్రీన్ పై చేసే బ్లాస్ట్ ఏ లెవెల్లో ఉంటుందో తెలియాలి అంటే ఈ అక్టోబర్ 5వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :