తమిళ హీరోకి మెగాస్టార్ సపోర్ట్ !


తమిళ హీరోలు చాలా మంది ప్రస్తుతం తెలుగు మార్కెట్ మీద ఎక్కువ దృష్టిపెడుతున్నారు. కొందరు తమిళంతో పాటు ఒకేసారి తెలుగులో కూడా సినిమాను రూపొందించి రిలీజ్ చేస్తుంటే ఇంకొందరు డబ్ చేసి వదులుతున్నారు. అలాంటి వారిలో విజయ్ ఆంటోనీ కూడా ఒకరు. ‘డా.సలీం, బిచ్చగాడు, భేతాళుడు’ వంటి సినిమాలతో సందడి చేసిన ఆయన తాజా చిత్రం ‘అన్నాదురై’ త్వరలో విడుదలకానుంది.

తెలుగులో దీనికి ‘ఇంద్రసేన’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఇది మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా ‘ఇంద్ర’ లోని టైటిల్ రోల్ పేరు కావడంతో క్రేజ్ ను సంపాదించుకుంటోంది. అంతేగాక ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ నెల 5న స్వయంగా చిరంజీవి రిలీజ్ చేయనుండటం మరో విశేషం. ఇలా విజయ్ ఆంటోనీకి చిరు తన వంతు సపోర్ట్ చేస్తుండటంతో సినిమా జనాల్లోకి మరింతగా వెళ్లే అవకాశముంది.