దర్శకరత్న దాసరికి పురస్కారం అందివ్వనున్న చిరు !


ఈ మధ్యే ఊపిరితిత్తులు, మూత్రపిండాల సంబంధిత సమస్యతో భాదపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చేరిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారు కీలకమైన ఆపరేషన్ అనంతరం కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు సాయంత్రం ఆయనకు ఒక ప్రముఖ పురస్కారాన్ని అందివ్వనున్నారు. డా. అల్లు రామలింగయ్య కళా పీఠం ఆధ్వర్యంలో యువకళావాహిని నాగేశ్వరరావు నిర్వహణలో జరగనున్న జాతీయ పురస్కార ప్రదానోత్సవం 2016 వేడుకలో దాసరికి ఈ జాతీయ పురస్కారాన్ని ఇవ్వనున్నారు.

రవీంద్ర భారతిలో జరగనున్న ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరై దాసరికి పురస్కారం అందిస్తారు. అలాగే యువ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ లు సైతం ఈ వేడుకకు ఆత్మీయ అతిధులుగా విచ్చేయనుండగా బ్రహ్మానందం, మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్, జి. జగదీశ్వర రెడ్డిలు కూడా ఈ పురస్కార మహోత్సవానికి హాజరవుతారు.