భారీ తారాగణంతో బరిలోకి దిగుతున్న మెగాస్టార్ !


మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం టైటిల్, మోషన్ పోస్టర్ లాంచ్ కొద్దిసేపటి క్రితమే జరిగింది. ఈ వేడుకలో టైటిల్ ‘సైరా నరసింహా రెడ్డి’ అని ప్రకటించిన టీమ్ సినిమాలో నటించనున్న భారీ తారాగణాన్ని కూడా ప్రకటించింది. చిత్రాన్ని జాతీయ స్థాయిలో రూపొందించాలని నిర్ణయించుకున్న మెగా టీమ్ అన్ని ముఖ్య పరిశ్రమల నుండి బడా స్టార్లను ప్రాజెక్టులోకి తీసుకుంది.

ముందుగా బాలీవుడ్ నుండి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను ఎంచుకున్న వీరు తమిళం నుండి ప్రస్తుతం మంచి ఫాలోయింగ్ తో ఉన్న హీరో విజయ్ సేతుపతిని, లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకున్నారు. ఇక మలయాళం నుండి కిచ్చ సుదీప్ ను కూడా ఒక ప్రధాన పాత్రకు ఎంచుకున్నారు. ఇక తెలుగు నుండి జగపతిబాబును కీ రోల్ కోసం చూజ్ చేసుకున్నారు. ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందివ్వనున్న ఈ చిత్రానికి రవి వర్మన్ సినిమాటోగ్రఫీ చేయనున్నారు.