“సై రా” ను టార్గెట్ చేసిన “వాల్తేరు వీరయ్య”

Published on Jan 27, 2023 8:02 pm IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. సిసలైన మాస్ కమ్ బ్యాక్ ఇదీ అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ బాబీ మెగాస్టార్ చిరంజీవిని ఈ చిత్రం లో పవర్ ఫుల్ గా, ఆడియెన్స్, ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్ పెక్ట్ చేస్తారో, అదే విధంగా ప్రెజెంట్ చేశారు. ఈ చిత్రం 100 కోట్ల రూపాయల షేర్ సాధించిన చిత్రం గా నిలవడం మాత్రమే కాకుండా, యూఎస్ లో కూడా 2 మిలియన్స్ క్లబ్ లో చేరి దూసుకు పోతుంది.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సై రా నరసింహ రెడ్డి చిత్రం ను వాల్తేరు వీరయ్య టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయినా, ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తోంది. అయితే ఇదే తరహాలో ఇంకొద్ది రోజులు కొనసాగితే చిరు కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం గా నిలవనుంది. మరి ఈ వాల్తేరు వీరయ్య చిత్రం సై రా రికార్డ్ లను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

ఈ చిత్రం లో మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, శృతి హాసన్ మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది. కేథరిన్ థెరిస్సా, ప్రకాష్ రాజ్, జయ సింహ, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :