వరుణ్ డాక్టర్ నుంచి రేపు “చిట్టెమ్మ” సాంగ్ గ్లింప్స్..!

Published on Oct 4, 2021 8:53 pm IST

శివ కార్తికేయన్‌ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మెడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘డాక్టర్‌’. శివ కార్తికేయన్ మరియు కేజే ఆర్ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘వరుణ్‌ డాక్టర్‌’ పేరుతో ఈ సినిమా తెలుగులోనూ విడుదల కాబోతుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి విశేష స్పందన లభించింది. అయితే రేపు మధ్యాహ్నం 12:02 గంటలకు ఈ సినిమా నుంచి చెట్టెమ్మ అనే సాంగ్ గ్లింప్స్ రిలీజ్ కాబోతుంది. ఇకపోతే ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :