మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుండి “చిట్టి అడుగు” లిరికల్ సాంగ్ విడుదల!

Published on Oct 11, 2021 12:57 pm IST

అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 పతాకం పై ఈ చిత్రాన్ని బన్నీ వాసు మరియు వాసు వర్మ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, పాటలు, విడియోలు ఇప్పటికే ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి చిట్టి అడుగు లిరికల్ సాంగ్ విడుదల అయింది. ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటకి లిరిక్స్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాయగా, జియా ఉల్ హక్ పాడటం జరిగింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో అఖిల్ అక్కినేని హీరోగా చేస్తుండటం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 15 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :