లేటెస్ట్ : చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ రిలీజ్ డేట్ ఫిక్స్

లేటెస్ట్ : చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Aug 10, 2022 2:00 AM IST

చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ యక్షన్ థ్రిల్లర్ మూవీ కోబ్రా. కెజిఎఫ్ సిరీస్ సినిమాలతో హీరోయిన్ గా యువతలో మంచి క్రేజ్ అందుకున్న శ్రీనిధి శెట్టి ఇందులో విక్రమ్ కి జోడీగా నటిస్తుండగా అజయ్ జ్ఞానముత్తు ఈ మూవీని ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన కోబ్రా మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా హరీష్ కన్నన్ ఫోటోగ్రఫి అందించారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ అందరినీ తో ఆకట్టుకున్నాయి. తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీని ఆగష్టు 11న ఇటీవల విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన యూనిట్, కొన్ని అనివార్య కారణాల వలన మూవీని వాయిదా వేసింది. ఇక లేటెస్ట్ గా తమ మూవీని ఆగష్టు 31న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ ప్రకటించింది. విక్రమ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా కోబ్రా పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి రిలీజ్ తరువాత ఈ మూవీ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు