అనుకున్నట్టే ఆశ్చర్యపరిచిన విక్రమ్..!

Published on Jul 12, 2022 8:00 am IST


గత కొన్ని రోజులు కితమే కోలీవుడ్ ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ తనకి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో అభిమానులు కాస్త కంగారు పడగా అంత కంగారు పడాల్సిన పని లేదని వైద్యులు అయితే తెలియజేసారు. అలాగే తర్వాత విక్రమ్ కూడా కోలుకున్నాక అందరి కోసం ఒక వీడియో కూడా పెట్టాడు. దీనితో పాటుగా విక్రమ్ అయితే మళ్ళీ వెంటనే తన భారీ సినిమా కోబ్రా ఆడియో లాంచ్ లో కూడా కనిపిస్తాడని పలు వార్తలు వచ్చాయి.

మరి ఇంత త్వరగా విక్రమ్ తన సినిమా కోసం వస్తాడా అని అంతా అనుకోగా నిన్న జరిగినటువంటి ఆడియో వేడుకలో నిజంగానే విక్రమ్ కనిపించి ఆశ్చర్యపరిచాడు. తన సినిమా పట్ల ఉన్న కమిట్మెంట్ ని తెలియజేస్తూ అభిమానుల కోసం రావడంతో వారైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి జ్ఞ్యానవేల్ ముత్తు తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 11న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :