గజ తుపాను బాధితులకు విక్రమ్ విరాళం !

గజ తుపాను ప్రభావంతో తమిళ నాడులోని సుమారు 12 జిల్లాలోని ప్రజలు త్రీవంగా నష్టపోయారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే వున్నాయి. ఇక ఈ తుపాను బాధితులను ఆదుకోవడానికి తమిళ స్టార్ హీరోలు ముందుకు వస్తున్నారు. దాంట్లో భాగంగా సూపర్ స్టార్ రజినీకాంత్ 50లక్షలు , విజయ్ 40 లక్షలు , సూర్య కుటుంభం 50లక్షలు , విజయ్ సేతుపతి 25లక్షలు అలాగే లైకా ప్రొడక్షన్స్ కోటి రూపాయల విరాళాలను ప్రకటించారు.

ఇక తాజాగా మరో స్టార్ హీరో చియాన్ విక్రమ్ తన వంతు సహాయంగా 25లక్షల రూపాయలను తమిళ నాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కి విరాళంగా అందజేశారు.

Advertising
Advertising