‘చియాన్’ విక్రమ్ నుంచి ఫస్ట్ టైం ఈ ఇంట్రెస్టింగ్ కాంబో.?

Published on Apr 16, 2022 9:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరోస్ లో నటన పరంగా ఎక్కడ వరకు అయినా వెళ్లగలిగే అతి కొద్ది మంది స్టార్ హీరోస్ లో విలక్షణ నటుడు ‘చియాన్’ విక్రమ్ కూడా ఒకరు. అయితే విక్రమ్ నటించిన రీసెంట్ సినిమా “మహాన్” ఓటిటి లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అలాగే మరోపక్క తాను నటించిన మరో భారీ సినిమా “కోబ్రా” థియేట్రికల్ రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న తన లైనప్ నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం ఒక కాంబోలో చేయనున్నట్టు తెలుస్తుంది.

అది కూడా కోలీవుడ్ స్టార్ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్ తో అట. అయితే ఈ సౌండింగ్ బాగుంది కానీ ఇది ఎంత వరకు నిజమో అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు టేకప్ చేస్తున్నట్టు టాక్. దీనితో కాంబోలో విక్రమ్ మొదటిసారి వర్క్ చేయనున్నాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ క్రేజీ కాంబో ఎప్పుడు టేకాఫ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :