‘చుట్టాలబ్బాయి’ నిర్మాతతో ‘రవితేజ’ కొత్త సినిమా

21st, August 2016 - 01:13:58 PM

ram-talluri-ravi-teja
యంగ్ హీరో ‘ఆది’ తో దర్శకుడు ‘వీరభద్రం’ తెరకెక్కించిన ‘చుట్టాలబ్బాయి’ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతూ మంచి కలెక్షన్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాత ‘రామ్ తల్లూరి’ నిర్మాణ రంగానికి కొత్తే అయినప్పటికీ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మళ్ళీ ఇప్పుడు ఈ నిర్మాత మాస్ మహారాజ్ ‘రవి తేజ’ హీరోగా మరో సినిమాని నిర్మించేందుకు సిద్దమవుతున్నాడు.

ఈ చిత్రానికి రవితేజకు ‘పవర్’ వంటి సూపర్ హిట్ సినిమాని అందించి, ‘పవన్ కళ్యాణ్’ వంటి స్టార్ హీరోతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని తెరకెక్కించిన ‘బాబీ’ దర్శకత్వం వహించనున్నాడు. అలాగే ఈ సినిమాని ఎస్.ఆర్.టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తారని కూడా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకి సంబందించి కాస్ట్ అండ్ క్రూ, ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.