ఆది ‘చుట్టాలబ్బాయి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

chutt
లవర్ బాయ్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తోన్న ఆది, తాజాగా ఈసారి కాస్త ఫ్యామిలీ డ్రామాను కూడా మిక్స్ చేసి ‘చుట్టాలబ్బాయి’ సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. కామెడీ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరభద్రం చౌదరి తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల చివరిదశలో ఉంది. ఇక ఇప్పటికే విడుదలైన ఆడియో మంచి స్పందనే తెచ్చుకోవడంతో హ్యాపీ అయిన టీమ్, తాజాగా విడుదల తేదీని కూడా ప్రకటించేసింది.

ఆగష్టు 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు వీరభద్రం చౌదరి తెలియజేశారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి కావచ్చిందని, సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఆది సరసన నమితా ప్రమోద్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను వెంకట్ తలారి, రామ్ తల్లూరి నిర్మించారు.