సినిగోయర్స్ 52 వ గోల్డెన్ జూబ్లీ అవార్డ్స్ సరికొత్త లోగో మరియు ప్రోమో విడుదల!

సినిగోయర్స్ 52 వ గోల్డెన్ జూబ్లీ అవార్డ్స్ సరికొత్త లోగో మరియు ప్రోమో విడుదల!

Published on Jul 25, 2021 6:35 PM IST


1970 నుండి ఎంతోమంది తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎంతోమంది గొప్ప నటీనటులకు, సాంకేతిక నిపుణులకు సినీగోయర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకరమైన సినీగోయర్స్ అవార్డు తో గౌరవించి సత్కరిస్తున్నారు. తాజాగా 2019 – 20 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు సినీ గోయర్స్ అవార్డుతో నటీనటులను మరియు సాంకేతిక నిపుణులను సత్కరించాలని సన్నాహాలను చేస్తున్నారు. అయితే ఆ వివరాలనే తెలియజేయటానికి హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. 51 వసంతాలు పూర్తిచేసుకుని 52వ గోల్డెన్ జూబిలీ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో జనరల్ సెక్రటరీ గా వ్యవహరిస్తున్న బి.రామకృష్ణ గారు ఈ 52వ అవార్డు కార్యక్రమం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె వి రమణ గారు మరియు జి హెహ్ ఎమ్ సి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత గార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. అలాగే తెలుగు సినిమా దర్శకులు త్రినాథ రావు నక్కిన, ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ మొండిటొక అరుణ్ కుమార్ మరియు కె ఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ ఏం వి శాస్త్రి తదితరులు పాల్గొనడం జరిగింది.

ఈ సందర్బంగా సినీ గోర్లు జనరల్ సెక్రటరీ బి రామకృష్ణ గారు మాట్లాడుతూ, మా నాన్న గారు ఎంతో కష్టపడి సినీ గోయర్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు ను స్థాపించారు అని అన్నారు. ఇప్పడు గోల్డెన్ జూబ్లీలోకి అడుగు పెడుతున్నామని, ఈ 52వ అవార్డు ఫంక్షన్ ను చాలా గొప్పగా నెక్స్ట్ లెవెల్ లో నిర్వహించాలని అనుకుంటున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం సినీ గోయర్స్ అవార్డ్స్ ఫంక్షన్ జరుపుతామని, తెలుగు చలన చిత్ర సీమ వున్నంతకాలం సినీ గోయర్స్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తామని తెలిపారు. తెలుగులో 52 సంవత్సరాలుగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తున్న ఏకైక సంస్థ మా సినీ గోయర్స్ అవార్డ్స్ అంటూ చెప్పుకొచ్చారు. మాకు ఎంతో సహాయసహకారాలు అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలిపారు. సెప్టెంబర్ లో 52 వ అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తామని, అవార్డు క్యాటగిరీ మరియు నామినీ లిస్ట్ ను ఆన్ లైన్ లో పొందుపరుస్తామని, ఆన్ లైన్ ద్వారానే ఓటింగ్ ఉంటుందని, అందుకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు.

డాక్టర్ పి శ్రీధర్ గారు మాట్లాడుతూ, ఇంతా ప్రతిష్టాకరమైన సినీ గోయర్స్ అవార్డ్స్ సంస్థ కి నన్ను ప్రెసెడెంట్ గా ఎన్నుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రేనోవా హాస్పిటల్స్ టైటిల్ స్పాన్సర్స్ గా ఉండటం చాలా గర్వంగా ఉందని, సినీ గోయర్స్ వారి ఓటింగ్ ప్రక్రియ పారదర్శకతగా ఉంటుంది అని తెలిపారు. సెప్టెంబర్ లో జరగబోయే మెయిన్ ఈవెంట్ మంచి విజయవంతం అవాలి అని కోరుకున్నారు.

జి హెహ్ ఎమ్ సి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత మాట్లాడుతూ, రామకృష్ణ గారి నాన్న గారు స్థాపించిన సినీ గోయర్స్ ని ఎంతో గొప్పగా నిర్వహిస్తున్న రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. సినిమాలు చూస్తే మంచి రిలీఫ్ ఉంటుంది, అందులో పనిచేసే నటీనటులకు టెక్నిషియన్స్ ని సినీ గోయర్స్ అవార్డు తో సత్కరించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన 52వ సినీగోయర్స్ అవార్డ్స్ లోగోని విడుదల చేయటం చాలా సంతోషం గా ఉందని తెలిపారు.

సినీ గోయర్స్ జాయింట్ సెక్రటరీ రాజేష్ పొన్నాడ మాట్లాడుతూ, సెప్టెంబర్ లో 52వ గోల్డెన్ జూబిలీ సినీ గోయర్స్ అవార్డు ఫంక్షన్ ను నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రేనోవా హాస్పిటల్స్ వారు మా కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్స్ గా ఉన్నారు అని, 52వ గోల్డెన్ జూబిలీ సినీ గోయర్స్ అవార్డు ఫంక్షన్ ని భారీగా ప్లాన్ చేస్తున్నామని, అందరు సపోర్ట్ చేయాలి అని కోరుకున్నారు.

తెలంగాణ గవర్నమెంట్ సలహాదారుడు డాక్టర్ కె వి రమణ గారు మాట్లాడుతూ, సినీ గోయర్స్ అవార్డ్స్ తో నాకు 40సంవత్సరాల అనుబంధం ఉందని, కిషన్ గారు ఎలా అయితే అవార్డు ఫంక్షన్ కి కృషి చేసారో అలాగే వాళ్ళ అబ్బాయి రామకృష్ణ గారు కూడా కృషి చేస్తున్నారు అని ప్రశంసించారు. మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 52 సంత్స రాలుగా అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తున్న ఏకైక సంస్థ సినీ గోయర్స్ అంటూ చెప్పుకొచ్చారు. రామకృష్ణని మరియు ఈ సినీ గోయర్స్ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి అని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ లో జరిగే ఫంక్షన్ అద్భుతంగా జరగాలి అని కోరుకున్నారు.

సినిమా దర్శకుడు త్రినాథ రావు నక్కిన మాట్లాడుతూ, నేను చిన్నపుడు ఒక ఆడియన్స్ గా సినీ గోయర్స్ అవార్డు వేడుకలకి వెళ్ళేవాడిని అని అన్నారు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడం చాలా ఆనందంగా ఉందాని, 52 సంవత్సరాలుగా అవార్డు ఫంక్షన్ నిర్వహించడం అంటే చాలా కృషి కావాలి అని, మరి అంత కృషి ఉన్న రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. ఈ అవార్డు ఫంక్షన్ మంచి సక్సెస్ అవ్వాలి అని కోరుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు