“జెంటిల్మాన్ 2” కి ప్రముఖ సినిమాటోగ్రాఫర్.!

Published on Jun 18, 2022 8:02 am IST

యాక్షన్ కింగ్ అర్జున్ మరియు శంకర్ ల కాంబోలో వచ్చిన భారీ హిట్ చిత్రం “జెంటిల్మెన్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాని పూర్తిగా కొత్త క్యాస్ట్ అండ్ క్రూ తో నిర్మాత కుంజుమోన్ తన బ్యానర్ నుంచి భారీ సీక్వెల్ ని అనౌన్స్ చేశారు. అయితే కొత్త నటీనటులను పరిచయం చేస్తూ పాన్ ఇండియా టెక్నీషియన్స్ తీసుకొస్తున్నారు. అలా లేటెస్ట్ గా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఎవరు అందించనున్నారో అనౌన్స్ చేశారు.

తమిళ్ మరియు తెలుగు భాషల్లో పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలు, చెన్నకేశవ రెడ్డి, వంశీ, రుద్రమదేవి 3డి, ఓం 3డి వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన అజయన్ విన్సెట్ ని నిర్మాత ఆహ్వానించారు. ఇక ఈ చిత్రానికి ఏ గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా నయనతార చక్రవర్తి, ప్రియా లాల్ లు నటిస్తున్నారు. అలాగే లెజెండరీ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :