‘భాగమతి’ లో నటించలేదంటున్న యువ హీరో !


ఈ నెలలో రిలీజ్ కానున్న తెలుగు చిత్రాల్లో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన ‘భాగమతి’ కూడా ఒకటి. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రంలో అనుష్కతో పాటు నటుడు ఆది పినిశెట్టి ఒక ముఖ్య పాత్ర చేశారని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య ఆది విభిన్నమైన పాత్రల్ని చేస్తుండటంతో చాలా మంది ఈ వార్తల్ని నిజమనే అనుకున్నారు.

కానీ వీటిపై స్పందించిన ఆది పినిశెట్టి మాత్రం తాను ‘భాగమతి’ సినిమాలో నటించలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేయగా థమన్ సంగీతాన్ని అందించారు. జనవరి 26న ఈ చిత్రాన్ని పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.