ఆ స్టార్ హీరోతో శంకర్ సినిమా చేయడంలేదట !

13th, September 2017 - 01:29:38 PM


దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ దర్శకుడు ఎవరంటే వినిపించే మొదటి పేరు శంకర్. అలాగే హీరోల్లో అజిత్ పేరు కూడా తప్పక ఉంటుంది. అలాంటి ఈ ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారని వార్తలు వినబడ్డాయి. తమిళ పరిశ్రమలో అయితే ఇంతకు ముందు వరకు ఇదే పెద్ద హాట్ టాపిక్ గా నడిచింది. నిజంగా శంకర్, అజిత్ ల కాంబో ఆంటే ఆ స్థాయి క్రేజ్ తప్పక ఉంటుంది. కానీ తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ కలయిక ఒట్టి పుకారని తేలిపోయింది.

ఈ మధ్యే ‘వివేగం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన అజిత్ ప్రస్తుతం కాస్త విరామం తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇక శంకర్ అయితే రజనీ ‘రోబో -2’ పనుల్లో యమ బిజీగా ఉన్నారు. ఇప్పటికైతే వీరిద్దరి మధ్య ఎలాంటి కథా చర్చలు జరగలేదని, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారని తెలుస్తోంది. సో తమిళ ప్రేక్షకుల్ని తెగ ఊరించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికైతే లేదని కన్ఫర్మ్ అయిపోయింది.