శర్వానంద్ “ఒకే ఒక జీవితం” ఓటిటి విడుదల పై క్లారిటీ!

Published on Nov 24, 2021 11:45 pm IST


శర్వానంద్ డిఫెరెంట్ జోనర్ లో వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. డిఫెరెంట్ కథాంశాలతో సినిమాలు చేసే శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఒకే ఒక జీవితం. అయితే గత కొద్ది రోజులుగా ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటి గా విడుదల కానుంది అని, మేకర్స్ సైతం అదే ప్లాన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అవన్నీ అవాస్తవం అని తెలుస్తోంది.

శర్వానంద్ హీరోగా చేస్తున్న ఒకే ఒక జీవితం చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్రీమ్ వారియర్స్ బ్యానర్ పై ప్రభు ఎస్ ఆర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో శర్వానంద్ సరసన హీరోయిన్ గా రీతూ వర్మ నటిస్తుండగా, అక్కినేని అమల కీలక పాత్ర లో నటిస్తుంది. ఈ చిత్రానికి జేక్స్ బెజొయ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :