“ప్రాజెక్ట్ కే” కి కమల్ భారీ రెమ్యునరేషన్ పై క్లారిటీ.!

Published on May 31, 2023 10:14 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం “ప్రాజెక్ట్ కే” కోసం తెలిసిందే. మరి ఇండియన్ సినిమా దగ్గర కాస్ట్లీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ సై ఫై అండ్ ఫాంటసీ డ్రామాగా అయితే రానుండగా ఆల్రెడీ అమితాబ్, దీపికా పదుకోన్ లాంటి బిగ్ స్టార్స్ కూడా ఉన్నట్టు తెలిసిందే.

అయితే లేటెస్ట్ గా ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నట్టుగా క్రేజీ రూమర్ అయితే బయటికి వచ్చింది. అయితే ఈ టాక్ తో పాటుగా కమల్ ఈ చిత్రం కోసం ఏకంగా 150 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా కూడా టాక్ వచ్చింది. మరి దీనిపై అయితే క్లారిటీ తెలుస్తుంది. కమల్ ఉన్నారని ఏమో కానీ ఇంత మొత్తం తీసుకుంటున్నారు అనే అంశంలో మాత్రం ఎలాంటి నిజం లేదట. అవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే అన్నట్టుగా తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :