క్లారిటీ..బాలయ్య ఆరోగ్యంపై ఆ వార్తల్లో నిజం లేదు.!

Published on Apr 26, 2022 12:01 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో చేసిన “అఖండ” చిత్రంతో భారీ హిట్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మరో భారీ మాస్ ప్రాజెక్ట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు.

అయితే ఈ సినిమా షూట్ లో బిజీగా ఉన్న తనపై లేటెస్ట్ గా పలు రూమర్స్ స్పీడ్ అయ్యాయి. తనకి ఒక సర్జరీ జరిగింది అని బాలయ్య రెస్ట్ లో ఉన్నారని కొన్ని వార్తలు సర్క్యులేట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలపై ఒక పూర్తి క్లారిటీ వచ్చింది.

తనకి అసలు ఎలాంటి సర్జరీ జరగలేదని తాను కేవలం రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే హాస్పిటల్ కి వెళ్లారని అంతే తప్ప ఇంకేమి లేదని అధికారిక ప్రకటన సినీ వర్గాల నుంచి వచ్చింది. అలాగే ఇంకా ఈరోజు సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నారని కన్ఫర్మ్ అయ్యింది. సో ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :