“భీమ్లా నాయక్” కొత్త సాంగ్ పై క్లారిటీ..అసలుది ముందుంది.!

Published on Nov 30, 2021 10:44 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న మాసివ్ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్” వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి ఇదే సమయంలో ఆ డేట్ కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సాలిడ్ అప్డేట్స్ ని చిత్ర యూనిట్ రివీల్ చేస్తూ వస్తున్నారు.

ఇక నిన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ నాలుగో సాంగ్ పై అప్డేట్ ని ఈరోజు ఉదయం తెలియజేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. మరి ఇప్పుడు ఈ అప్డేట్ బయటకి వచ్చింది. “ఎసెన్స్ ఆఫ్ భీమ్లా నాయక్” అడవి తల్లి మాట అంటూ ఈ నాలుగో సాంగ్ ని రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ఈ అప్డేట్ లో కన్ఫర్మ్ చేశారు.

అయితే ఈ సాంగ్ అనౌన్సమెంట్ లో ఎక్కడా కూడా ఈ పాట పవన్ ఆలపించింది అని మెన్షన్ చెయ్యలేదు. అంటే అసలు పాట ఇంకా ముందు ఉంది అని చెప్పాలి. ఇక థమన్ ఇచ్చిన ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ భారీ మాస్ సినిమాకి త్రివిక్రమ్ కూడా వర్క్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :