గని సినిమా రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ!

Published on Feb 1, 2022 2:00 pm IST

వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం గని. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. టైటిల్ పోస్టర్ విడుదల అనంతరం నుండి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తరహా లో రెండు రిలీజ్ డేట్ లను ప్రకటించింది.

ఈ చిత్రం ను ఫిబ్రవరి 25 వ తేదీన లేదా మార్చ్ 4 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషం లో వాయిదా పడింది. ఈ చిత్రం లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో ఉపేంద్ర, సునీల్ శెట్టి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :