“లాల్ సింగ్ చద్దా” ఓటిటి లోకి వచ్చేది అప్పుడే!

“లాల్ సింగ్ చద్దా” ఓటిటి లోకి వచ్చేది అప్పుడే!

Published on Jul 28, 2022 8:00 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్ట్ 11, 2022 న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటించింది. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఈ చిత్రం లో మరొక కీలక పాత్రలో నటిస్తున్నారు.

లాల్ సింగ్ చద్దా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏమిటంటే, ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 6 నెలల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ లోకి రానుంది. కాబట్టి, ఫారెస్ట్ గంప్ రీమేక్ 2023 ప్రారంభంలో మాత్రమే OTT లో విడుదల అవుతుంది. ఇది మేకర్స్ నుండి షాకింగ్ చర్య అని చెప్పాలి. లాల్ సింగ్ చద్దా టీమ్ డిజిటల్ రైట్స్‌ను 160 కోట్ల రూపాయల కి అమ్మినట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ మరియు పారామౌంట్ పిక్చర్స్ ద్వారా బ్యాంక్రోల్ చేయబడిన ఈ బిగ్గీకి ప్రీతమ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు