“అజిత్ 61” లో ఈ యంగ్ హీరోయిన్ పై క్లారిటీ.!

Published on May 10, 2022 3:30 pm IST

కోలీవుడ్ స్టార్ హీరోలలో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. అయితే తాను హీరోగా నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా “వలిమై” తో మంచి విజయాన్ని తాను అందుకున్నారు. మరి ఇదిలా ఉండగా తన నెక్స్ట్ సినిమాలో అజిత్ సరసన మంజు వారియర్ నటిస్తున్నట్టుగా కన్ఫామ్ కూడా అయ్యింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో లేటెస్ట్ గా ఇంకో యంగ్ హీరోయిన్ చేరినట్టుగా టాక్ వైరల్ అవుతుంది..

ఆమె మరెవరో మన తెలుగు సినిమాలో నాచురల్ స్టార్ నానితో పరిచయం అవుతున్న నజ్రియా నజీమ్. అయితే ఈమె పై ఒక అనధికారిక సోషల్ మీడియా ఖాతా ఉండగా దాని నుంచి కొన్ని ట్వీట్ లు పడ్డాయి. దీనితో చాలా మంది అజిత్ సినిమాలో ఈమె కన్ఫర్మ్ అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ అది కేవలం అవాస్తవం అని చెప్పాలి. సో ఆ వార్తలో అయితే ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఈ సినిమాని దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తుండగా బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :