“పుష్ప” నిడివిపై క్లారిటీ..అంతసేపు సుకు’మార్క్’ మ్యాజిక్ ఉండాల్సిందే.!

Published on Dec 14, 2021 11:06 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా “పుష్ప ది రైజ్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం పాన్ ఇండియన్ వైడ్ పెద్ద ఎత్తున రిలీజ్ కి రెడీ గా ఉంది. అయితే అల్లు అర్జున్, సుకుమార్ మరియు దేవిశ్రీ ప్రసాద్ ల నుంచి వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో జెనరల్ మూవీ లవర్స్ లో కూడా ఈ చిత్రం చాలా ఆసక్తిని రేపింది.

మరి వీరందరికీ పుష్ప థియేటర్స్ లో పుష్ప ఎంతసేపు ట్రీట్ ఇవ్వబోతుందో కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా నిడివి ఏకంగా 2 గంటల 59 నిముషాలు వచ్చిందట. అంటే సుమారు మూడు గంటలు థియేటర్ లో కూర్చొని ఈ సినిమా చూడాల్సిందే. మరి ఇంత సేపు ఉండాలంటే డెఫినెట్ గా సుకు’మార్క్’ మ్యాజిక్ ఉండాల్సిందే అని చెప్పాలి. ట్రైలర్ కాస్త రొటీన్ గానే అనిపించినా సుకుమార్ డెఫినెట్ గా కొత్త పుష్ప ని చూపిస్తారని అంతా ఆశిస్తున్నారు. మరి అదేంటో తెలియాలి అంటే ఈ డిసెంబర్ 17వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :