రాజమౌళి నెక్స్ట్ సినిమా ప్రొడక్షన్ పై క్లారిటీ ఇదే!

Published on Nov 25, 2021 1:30 pm IST

రౌద్రం రణం రుధిరం చిత్రం పనుల్లో దర్శక దిగ్గజం రాజమౌళి బిజిగా ఉన్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం అనంతరం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమైన సంగతి అందరికీ తెలిసిందే.

ప్రముఖ నిర్మాత కే ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో భారీ స్థాయి లో నిర్మించనున్నారు. అడ్వెంచర్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి దిల్ రాజు సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు అంటూ పలు వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ సోలో గా నిర్మించనున్నాడు అని తెలుస్తుంది. ప్రస్తుతం స్టొరీ సిట్టింగ్స్, ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :