మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు దర్శకుడు సుకుమార్ తో సినిమా కోసం సిద్ధం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ గ్యాప్ లో చరణ్ ఓ అవైటెడ్ సినిమాలో చిన్న కామియోలో కనిపించనున్నాడు అంటూ ఓ పుకారు ఓ రేంజ్ లో షికారు చేసేస్తోంది. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఇరుముడి సినిమాలో ఫోక్ సాంగ్ మల్లెపూల పల్లకి ఇప్పుడు వైరల్ అవుతుంది.
అయితే ఈ సాంగ్ లోనే చరణ్ ఎంట్రీ అంటూ ఓ రూమర్ మొదలై ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. ఇక ఫైనల్ గా దీనిపై మెగా కాంపౌండ్ దగ్గర వర్గాల నుంచి క్లారిటీ వచ్చేసింది. చరణ్ ఎలాంటి కామియో ఈ సినిమాలో కానీ సాంగ్ లో గాని చేయలేదట. సో ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు. ఫ్యాన్స్ ఈ విషయంలో క్లారిటీ తెలుసుకొని తప్పుడు అంచనాలు పెట్టుకోవడం ఆపేస్తే బెటర్. ఇక ఈ సినిమాని శివ నిర్వాణ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. ఈ ఆగస్ట్ 21న సినిమా విడుదల కాబోతోంది.
