రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ పై అందరికీ క్లారిటీ.!

Published on Feb 23, 2023 10:04 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా చేస్తుండగా దీని కన్నా ముందు అయితే చేసిన భారీ హిట్ సినిమా “రౌద్రం రణం రుధిరం” తో అయితే గ్లోబల్ గా చరణ్ క్రేజ్ మరో లెవెల్ కి అయితే రీసెంట్ గానే చరణ్ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్ కోసం పయనం అయ్యిన సంగతి తెలిసిందే. కానీ అంతకు ముందు అయితే చరణ్ యూఎస్ లో ఫేమస్ మార్నింగ్ షో లో పాల్గొనడం జరిగింది.

అయితే చరణ్ అమెరికా వరకు కూడా స్వామీ మాల లోనే వెళ్లిన సంగతి తెలిసిందే. దీనితో అన్ని ఈవెంట్స్ కూడా చరణ్ అలాగే అటెండ్ అవుతాడని అన్నారు. కానీ అక్కడికి వెళ్ళాక అయితే మరో లుక్స్ లోకి మారిపోయి సూట్ మరియు షూస్ తో కనిపించాడు. దీనితో చరణ్ మాల లో ఉన్నపుడు ఎలా ఇలా మారుతాడని చాలా మందికి డౌట్స్ మొదలయ్యాయి.

అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ ఏమిటంటే చరణ్ మొత్తం 21 రోజుల మాల వేసుకోగా అది నిన్నటితో పూర్తయింది. అందుకే అక్కడ దేవాలయంలో చరణ్ మాల కంప్లీట్ చేసుకొని మళ్ళీ యథా డ్రెస్సింగ్ కి వచ్చాడు. అంతే కానీ మాల లోనే ఉండి అయితే ఇలా డ్రెస్సింగ్ చేయలేదట.

సంబంధిత సమాచారం :