అక్కడ “RRR” భారీ ఈవెంట్ కి సన్నాహాలు..క్లారిటీ ఇదే

Published on Oct 27, 2021 6:59 am IST

మొత్తం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్న అతి కొద్ది సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని సిద్ధంగా ఉంది. ఇక రాజమౌళి సినిమాలు అంటే నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ ఉంటాయి అని తెలిసిందే.

అందులో భాగంగానే ఈ చిత్రం నుంచి కూడా గ్రాండ్ ప్లాన్స్ చూడబోతున్నమట. చిత్ర యూనిట్ ఏకంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దుబాయ్ లో ప్లాన్ చేసారని నిన్నటి నుంచి ఓ టాక్ వైరల్ అవుతుంది. అయితే దీనిపై క్లారిటీ ఏమిటంటే ఇది నిజమేనట. అందులో భాగంగానే నిర్మాత డివివి దానయ్య ఆల్రెడీ అక్కడ రంగంలోకి దిగి ప్లాన్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. కానీ మన దగ్గర మాత్రం ఇంకా అలాంటి భారీ ఈవెంట్స్ ఉంటాయో లేదో అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More