సమంత హెల్త్ రూమర్స్ పై అసలు క్లారిటీ.!

Published on Nov 24, 2022 2:00 pm IST

మన సౌత్ ఇండియా సినిమా దగ్గర టాప్ హీరోయిన్స్ లో ఒకరైనటువంటి సమంత రీసెంట్ గా నటించిన లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రం “యశోద” తో పలకరించింది. మరి ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాకముందే ఆమె కండరాల సంబంధించి ఓ వ్యాధి బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఆమె సినిమా రిలీజ్ బయట షాకింగ్ న్యూస్ గా మారింది. అయితే ఆ సమయంలోనే బాగోలేనప్పుడే ఆమె డబ్బింగ్ మరియు ప్రమోషన్స్ లో కూడా పాల్గొంది.

ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ గా మళ్ళీ సామ్ ఆరోగ్యంపై కొన్ని వార్తలు రాగా దీనిపై క్లారిటీ తెలుస్తుంది. అయితే సామ్ ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యినట్టుగా వార్తలు వస్తుండగా ఇందులో అసలు నిజం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం సామ్ బాగానే ఉందని తెలుస్తుంది. దీనితో ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కన్ఫర్మ్ అయ్యింది. ఇక నెక్స్ట్ అయితే సామ్ “శాకుంతలం” అనే మరో భారీ ప్రాజెక్ట్ తో రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :