“పుష్ప 2” పై స్ప్రెడ్ అవుతున్న షాకింగ్ అంశంపై క్లారిటీ.!

Published on May 20, 2023 7:06 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది. ఇక మేకర్స్ కూడా సాలిడ్ అప్డేట్స్ కూడా ఇస్తుండగా ఇప్పుడు ఓ షాకింగ్ అంశం అయితే స్ప్రెడ్ అవుతూ చాలామందికి షాకిచ్చింది.

ఈ చిత్రంలో రష్మికా మందన్నా చేస్తున్న శ్రీవల్లి పాత్ర చనిపోతుంది అంటూ ఓ పిక్ లీక్ అయ్యి ఒక్కసారిగా వైరల్ అయ్యింది. దీనితో ఇది చాలా మంది నిజం అని నమ్మేశారు. కానీ అసలు అది ఆ సినిమా లో క్లిప్పే కాదట. అది ఓ మరాఠీ సినిమాకి చెందిన సీన్ కాగా అందులో కనిపించే ఆమె కూడా రష్మికా కాదట. సో ఇది పుష్ప 2 లో సీన్ అండ్ లీక్ అని చెప్పడంలో ఎలాంటి నిజం లేదు.కనుక ఫ్యాన్స్ ఈ విషయంలో ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదు.

సంబంధిత సమాచారం :