“SSMB28” టైటిల్ రిలీజ్ పై క్లారిటీ!

“SSMB28” టైటిల్ రిలీజ్ పై క్లారిటీ!

Published on May 16, 2022 12:49 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తాజా చిత్రం సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ తదుపరి చిత్రం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో అన్న విషయం తెలిసిందే. తాత్కాలికంగా SSMB 28 అనే టైటిల్‌తో, ఈ చిత్రం ఫిబ్రవరి 2022 లో గ్రాండ్‌గా లాంచ్ చేయబడింది.

ఇప్పుడు, తాజా బజ్ ఏమిటంటే, ఈ చిత్రం టైటిల్‌ను మే 31, 2022న అంటే సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజున ప్రకటించాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జులైలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు