థాంక్యూ, గని చిత్రాల పై క్లారిటీ వచ్చేనా?

Published on Dec 8, 2021 11:40 am IST

నాగ చైతన్య, రాశి ఖన్నా, అవికా గోర్ లు ప్రధాన పాత్రల్లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం థాంక్యూ. ఈ చిత్రం ను త్వరలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ను థియేటర్ల లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం కి ఓటిటి ఆఫర్స్ వస్తున్నా, థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.

వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రినైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ ల పై ఈ చిత్రాన్ని సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల కావాల్సి ఉండగా, ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఓటిటి ఆఫర్స్ వస్తున్నప్పటికీ థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల విడుదల ల పై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :