విజయ్ 66 లో ఈ హీరోయిన్ పై లేటెస్ట్ క్లారిటీ..!

Published on May 25, 2022 11:40 am IST


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ జోసెఫ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సినిమా కోసం అందరికీ తెలిసిందే. విజయ్ కెరీర్ లో 66వ సినిమాగా ఒక బై లాంగువల్ సినిమాగా చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాతోనే తెలుగు లో విజయ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గా మేకర్స్ తమ భారీ కాస్ట్ ని రివీల్ చేశారు. అయితే ఈ లిస్ట్ లో మరో యంగ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి మెహ్రీన్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది అని బజ్ బయటకి వచ్చింది.

అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ వినిపిస్తోంది. అసలు ఈ సినిమా కాస్ట్ లో ఈమె లేదట. అవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే అని అలాగే ఒక్క హీరోయిన్ మాత్రమే ఈ సినిమాలో ఉంటుంది అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :