టిల్లు స్క్వేర్ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్!

Published on Feb 12, 2023 8:55 pm IST


సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన డీజే టిల్లు యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఫన్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఆ సినిమాతో సిద్దూకి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ టిల్లు స్క్వేర్ రూపొందుతోంది. ఈ మూవీని మొదట మార్చి 2023లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్.

కానీ సార్ ప్రమోషన్స్‌లో నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని జూలై 2023 లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 50% షూటింగ్ పూర్తయిందని నాగ వంశీ వెల్లడించారు. అందువల్ల క్రేజీ డీజే టిల్లును తిరిగి యాక్షన్‌లోకి తీసుకురావడానికి అభిమానులు మరికొంత కాలం వేచి ఉండక తప్పదు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక గా నటిస్తుంది. ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సీక్వెల్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :