వరుణ్ తేజ్ “గని” రిలీజ్ డేట్ పై క్లారిటీ!

Published on Dec 25, 2021 1:02 am IST

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం గని. ఈ చిత్రం డిసెంబర్ 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషం లో వాయిదా పడటం జరిగింది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన సరికొత్త విడుదల తేదీ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా, తాజాగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

వరుణ్ తేజ్ టాలీవుడ్ లో 7 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం తో డిసెంబర్ 25 వ తేదీన ఉదయం 10 గంటలకు గని చిత్రం విడుదల తేదీ కి సంబంధించిన అప్డేట్ ను చిత్ర యూనిట్ వెల్లడించనుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా ను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీని పై ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :