యష్, నారా లోకేష్ మీట్ పై క్లారిటీ.!

యష్, నారా లోకేష్ మీట్ పై క్లారిటీ.!

Published on Dec 16, 2022 11:00 AM IST

లేటెస్ట్ గా కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ మరియు ఏపీ మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ లు కలిసి ఓ కీలక మీటింగ్ లో ఉన్నట్టుగా కనిపించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ ఫోటోలు బయటకి రావడంతో పాటుగా కొన్ని రూమర్స్ కూడా ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి.

ఇక ఇదిలా ఉండగా అసలు ఈ మీటింగ్ అంశం దేనికి వచ్చింది ఇద్దరూ కావాలని మీట్ అయ్యారా వేరే కారణం ఏమన్నా ఉందా అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఈ మీటింగ్ అయితే అసలు ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదట బెంగళూర్ లో హోటల్ లో ఇద్దరూ బస చేయగా యాదృచికంగానే కలవడంతో ఈ మీటింగ్ సంభవించింది అట. దీనితో అలా మీట్ అప్ అయ్యారు తప్ప ఇందులో వేరే కోణం ఏది లేదు అని ఇప్పుడు క్లారిటీ తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు