ఈ నెల 10న సినీ ప్రముఖుల తో సీఎం జగన్‌ కీలక సమావేశం…చర్చించనున్న అంశాలు ఇవే!

ఈ నెల 10న సినీ ప్రముఖుల తో సీఎం జగన్‌ కీలక సమావేశం…చర్చించనున్న అంశాలు ఇవే!

Published on Feb 8, 2022 7:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సినిమా టికెట్ల ధరల అంశం పై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తో సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు భేటీ అయ్యి, తమ అభిప్రాయాలను వెల్లడించారు. అంతేకాక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిను అభ్యర్దిస్తూ టికెట్ల ధరలను పెంచాల్సింది గా పలుమార్లు సూచించడం జరిగింది. ఈ మేరకు మరొకసారి ఈ నెల 10 వ తేదీన సినీ ప్రముఖుల తో సీఎం జగన్ సమావేశం కానున్నారు.

సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అక్కినేని, సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమ అంశాల పై సీఎం జగన్‌తో మంత్రి పేర్ని నాని చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా చర్చించాల్సిన అంశాల పై సీఎంతో మంత్రి పేర్ని నాని చర్చ జరిగింది. సినిమా టికెట్ల ధర పెంపు, సినీ పరిశ్రమకు రాయితీల పై, సినిమా థియేటర్లలో వసతులు, సదుపాయాల కల్పన పై కీలక చర్చ జరిగింది. టికెట్ల ధర పెంపుపై అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎంతో చర్చ. ఈ నేపథ్యం లో రేపు మరో సారి సీఎం జగన్‌తో భేటీ కానున్న మంత్రి పేర్ని నాని. ఎల్లుండి భేటీలో చర్చించే అంశాలపై సీఎంతో మంత్రి పేర్ని నాని మాట్లాడనున్నారు. ఈ అంశాల పై చర్చ సినీ పరిశ్రమ లో హాట్ టాపిక్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు