రేపు సీఎం జగన్ తో సినీ పెద్దలు కీలక భేటీ!

Published on Feb 9, 2022 9:19 pm IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సినిమా టికెట్ల ధరల అంశం పై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తో సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు భేటీ అయ్యి, తమ అభిప్రాయాలను వెల్లడించారు. అంతేకాక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిను అభ్యర్దిస్తూ టికెట్ల ధరలను పెంచాల్సింది గా పలుమార్లు సూచించడం జరిగింది. ఈ మేరకు మరొకసారి ఈ నెల 10 వ తేదీన సినీ ప్రముఖుల తో సీఎం జగన్ సమావేశం కానున్నారు.

సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ భేటీ కానున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమ అంశాల పై సీఎం జగన్‌తో మంత్రి పేర్ని నాని చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా చర్చించాల్సిన అంశాల పై సీఎంతో మంత్రి పేర్ని నాని చర్చ జరిగింది. సినిమా టికెట్ల ధర పెంపు, సినీ పరిశ్రమకు రాయితీల పై, సినిమా థియేటర్లలో వసతులు, సదుపాయాల కల్పన పై కీలక చర్చ జరిగింది. టికెట్ల ధర పెంపుపై అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎంతో చర్చ.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌ని చిత్ర పరిశ్రమ పెద్దలు కలవనున్నారు. చిత్ర పరిశ్రమ సమస్యల పై సీఎం జగన్ తో సమావేశంలో చర్చించనున్న చిత్ర పరిశ్రమ బృందం. సీఎం జగన్ తో చిత్రబృందం భేటీ పై అటు ప్రజల్లో, ఇటు సినీ పరిశ్రమ ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :