నందమూరి హరికృష్ణ మృతికి సంతాపం తెలిపిన కేసీఆర్‌, చంద్రబాబు !

సినీ హీరో, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ (61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాదం సంఘటన ఈ రోజు ఉదయం చేసుకుంది. స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆయన శరీరం సహకరించకపోవడంతో హరికృష్ణగారు మృతి చెందారు. ఆయన మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన హరికృష్ణగారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకూడా ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటినా వారు ప్రత్యేక హెలికాప్టర్‌ లో హైదరాబాద్‌ బయలుదేరుతూ సంతాపం ప్రకటించారు.