మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం పై ఆరా తీసిన సీఎం కేసీఆర్

Published on Jan 27, 2022 2:40 pm IST


మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం పై ఇటీవల సోషల్ మీడియా వేదిక గా ఒక పోస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ స్వల్ప లక్షణాలతో కూడిన కరోనా వైరస్ సోకింది అంటూ చెప్పుకొచ్చారు. తనను ఇటీవల కలిసిన వారు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి అని సూచించారు. ఈ మేరకు చిరు అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. మెగాస్టార్ చిరంజీవి గారిని ఫోన్ లో పరామర్శించారు కేసీఆర్. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి పలు ప్రాజెక్టు లతో బిజిగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణం అవి కాస్తా వాయిదా పడ్డాయి.

సంబంధిత సమాచారం :