లేటెస్ట్ : కృష్ణ గారి అంత్యక్రియలపై సీఎం కెసిఆర్ ఆదేశాలు.!

లేటెస్ట్ : కృష్ణ గారి అంత్యక్రియలపై సీఎం కెసిఆర్ ఆదేశాలు.!

Published on Nov 15, 2022 1:13 PM IST

టాలీవుడ్ దిగ్గజ హీరో సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు తెల్లవారు జామున కన్ను మూసినా సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ విషాద ఘటనతో తెలుగు సినిమా సహా తెలుగు రాష్ట్రాలు ప్రముఖ రాజకీయ నాయకులూ అలాగే హిందీ నుంచి కూడా అనేకమంది ప్రముఖులు కృష్ణ గారి మరణం పట్ల సంఘీభావం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు.

కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ఈ విషయంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూసుకోవాలని తాను ఆర్డర్ చేసినట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇక మరి ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివదేహాన్ని ఉంచనుండగా రేపు ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు