ఫిలిం ఇండ‌స్ట్రీకి సీఎం రేవంత్ ప్రీ-కండీష‌న్

ఫిలిం ఇండ‌స్ట్రీకి సీఎం రేవంత్ ప్రీ-కండీష‌న్

Published on Jul 2, 2024 4:28 PM IST

టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌కు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఓ ష‌ర‌తును విధించారు. ఫిలిం ఇండ‌స్ట్రీకి సంబంధించి ఏదైనా సినిమా రిలీజ్ స‌మ‌యంలో టికెట్ రేట్ల ధ‌ర‌ల పెంపు, థియేట‌ర్ల‌కు సంబంధించిన అనుమ‌తుల కోసం ప్ర‌భుత్వం వ‌ద్ద‌కు వ‌చ్చేవారికి ఈ ష‌రతు వ‌ర్తిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. తాజాగా జరిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న దీనిపై మాట్లాడారు.

రాష్ట్రంలో డ్ర‌గ్స్ నియంత్ర‌ణ‌, సైబ‌ర్ నేరాల‌ వంటి అంశాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గహ‌న తీసుకొచ్చే కార్య‌క్ర‌మాలు చేయాల‌ని ఆయ‌న సూచించారు. సామాజిక బాధ్య‌త‌గా దీనిని తీసుకోవాల‌ని ఆయ‌న తెలిపారు. ఓ సినిమా ప‌ర్మిష‌న్, టికెట్ రేట్ల పెంపుల అనుమ‌తి కోసం వ‌చ్చే వారు, తమ సినిమాలోని స్టార్స్ తో ఓ సోష‌ల్ అవేర్నెస్ వీడియో తీసి ప్ర‌భుత్వానికి అందించాల్సిందేన‌ని రేవంత్ కండీషన్ పెట్టారు.

ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి అవేర్నెస్ వీడియో చేసి తెలంగాణ ప్రభుత్వానికి అందించార‌ని.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు రేవంత్ తెలిపారు. ఇక‌పై ఫిలిం ఇండ‌స్ట్రీ నుంచి ఇలాంటి సోష‌ల్ అవేర్నెస్ వీడియోలు ఎక్కువ‌గా రావాల‌ని ఆయ‌న సూచించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు