విక్రమ్ “కోబ్రా” థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ!

Published on Jun 28, 2022 9:15 am IST

విక్రమ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోబ్రా. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 11, 2022న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో KGF ఫ్రాంచైజీ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే కోబ్రా చిత్రం తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను నటుడు ఉదయనిధి స్టాలిన్ దక్కించుకున్నట్లు తాజా సమాచారం. స్టాలిన్ తన హోమ్ బ్యానర్ రెడ్ జెయింట్ మూవీస్ పై ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇదే విషయాన్ని ఆన్‌లైన్‌లో ప్రకటించారు. కోబ్రాలో ఇర్ఫాన్ పఠాన్, మృణాళిని రవి, రోషన్ మాథ్యూ, మియా జార్జ్, కెఎస్ రవి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :