కలర్ ఫొటో చిత్రానికి టీఆర్పీ ఎంతంటే?

Published on Dec 16, 2021 2:30 pm IST

సుహస్, చాందినీ చౌదరి లు హీరో హీరోయిన్ లుగా సందీప్ రాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం కలర్ ఫొటో. డైరెక్ట్ డిజిటల్ గా విడుదల అయిన ఈ చిత్రం భారీ రెస్పాన్స్ ను కొల్లగొట్టి విజయం సాధించింది. ఈ చిత్రం ను సాయి రాజేష, బెన్ని ముప్పనేని లు నిర్మించడం జరిగింది. ఈ చిత్రం తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర లో ప్రసారం అయింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో ప్రసారం అయిన ఈ చిత్రం డీసెంట్ టీఆర్పీ ను సాధించడం జరిగింది. 6.30 టీఆర్పీ ను సాధించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సాయి రాజేష్ కథ అందించగా, హర్ష మరియు సునీల్ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :