వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన కలర్ ఫొటో!

Published on Dec 1, 2021 10:30 pm IST


సుహస్ హీరోగా, చాందినీ చౌదరి హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం కలర్ ఫొటో. ఈ చిత్రం ఆహా వీడియో ద్వారా ప్రేక్షకులకు అందుబాటులో వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో నటించిన హర్ష, సునీల్ లకు కూడా మంచి పేరును తీసుకు వచ్చింది. సాయి రాజేష్ కథ అందించిన ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్దం గా ఉంది.

ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ఒక ప్రోమో ను స్టార్ మా తాజాగా విడుదల చేయడం జరిగింది. ఆహా వీడియో లో ప్రేక్షకులను అలరించిన కలర్ ఫొటో, బుల్లితెర పై ఎలాంటి విజయం సాధిస్తుందొ చూడాలి.

సంబంధిత సమాచారం :