‘ది వారియర్’ నుండి కలర్స్ సాంగ్ రిలీజ్ ….!!

Published on Jul 6, 2022 9:00 pm IST

రామ్ లేటెస్ట్ మూవీ ది వారియర్ రిలీజ్ కి దగ్గర పడుతూ ఉండడంతో యూనిట్ ఓవైపు సాంగ్స్ రిలీజ్ చేస్తూ మరోవైపు ప్రమోషనల్ కార్యక్రమాలతో మరింతగా సినిమాని ప్రేక్షకాభిమానులను చేరువ చేస్తోంది. ఇప్పటికే ది వారియర్ థియేట్రికల్ ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో స్పందన రాబట్టడంతో పాటు, సాంగ్స్ కూడా మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుని సినిమాపై హైప్ ఎంతో పెంచేసాయి.

రామ్ ఈ మూవీలో సత్య ఐపీఎస్ పాత్ర చేస్తుండగా యువ నటుడు ఆది పినిశెట్టి గురు అనే విలన్ పాత్ర చేస్తున్నారు. ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి రామ్ కి జోడీగా నటిస్తున్న ది వారియర్ మూవీ నుండి నేడు, కలర్స్ సాంగ్ రిలీజ్ చేసింది యూనిట్. జస్ప్రీత్ జాజ్ ఎంతో అద్భుతంగా ఆలపించిన ఈ సాంగ్ ఎంతో క్యాచీగా మెలోడియస్ గా ఉంది. ముఖ్యంగా యువతని ఆకట్టుకునేలా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ సాంగ్ కి ట్యూన్ ని అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ మూవీ జులై 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :